ఎవరెన్ని కుట్రలు చేసినా పల్నాడులో.. యువగళం చరిత్ర
పల్నాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర పన్నిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర ప్రవేశించడానికి ముందే వైసీపీ అలజడి సృష్టిస్తోందని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పల్నాడులో యువగళం చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడివి నియంతృత్వ పోకడలని, టీడీపీ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఎమ్మెల్యే వెళ్లడమేంటని ప్రశ్నించారు. దురుద్దేశంతోనే టీడీపీ శ్రేణుల వద్దకు వెళ్లి బొల్లా సవాల్ చేశారని ఆరోపించారు. ఆయన తీరు చూస్తుంటే ప్రభుత్వమే కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. పల్నాడులో లోకేశ్ పాదయాత్ర, వైసీపీకి అంతిమయాత్ర కానుందని అన్నారు.













