అమరావతిపై సీఎం జగన్, కేంద్రం సృష్టత ఇవ్వాలి
అమరావతిపై మంత్రులు మాటలు అయోమయానికి గురి చేస్తున్నాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మంత్రుల మాటలతో రాజధాని రైతులు ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు. రాజధానిపై టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు రైతుల్లో ఆందోళన మరింత పెంచాయన్నారు. రాజధానిలో లబ్ధి చేకూరే విధంగా గతంలో భూములు తీసుకుని ఉంటే ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవచ్చు అని అన్నారు. రాజధాని ప్రాంతంలో అన్ని కులాలు, అన్ని మతాలకు చెందిన వారున్నారన్నారని పేర్కొన్నారు. సీఎం జగన్తో పాటు, కేంద్ర ప్రభుత్వం రాజధానిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేలా సృష్టత ఇవ్వాలన్నారు. పోలవరం, అమరావతి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలవరం ఒక ఏడాది ఆలస్యమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కోట్ల నష్టం వస్తుందన్నారు. చంద్రబాబు మీద కోపం ఉంటే తప్పు ఎక్కడ జరిగిందో విచారించి చర్యలు తీసుకోవచ్చన్నారు.













