బీజేపీ మైండ్‌గేమ్ … పత్తిపాటి
కొంతమంది నేతలు టీడీపీని వీడి తమ పార్టీలో చేరుతున్నారంటూ దుష్ప్రచారంతో బీజేపీ నేతలు మైండ్‌గేమ్ ఆడుతున్నారని మాజా మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కూడా బీజేపీ, వైసీపీలు కలసి ఇలాంటి మైండ్గేమ్లతోనే టీడీపీపై దుష్ప్రచారం చేసి గెలిచారని చెప్పారు. 40 శాతం ఓటు బ్యాంక్ గల టీడీపీని ఖాళీ చేయడం ఎవరితరం కాదని, పార్టీని ఖాళీ చేయాలనుకున్న వారే ఖాళీ అవుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర నేతలు కె.ఎస్.జవహర్, దివ్యవాణి, సాధినేని యామినీ శర్మ పాల్గొన్నారు.













