ఈ నెల 23న తెలుస్తుంది : ప్రతిపాటి
ఎన్నికల తర్వాత జగన్ ఆంధ్ర వైపు కన్నెత్తి కూడా చూడలేదు. లోటస్పాండ్లో కూర్చొని అధికారం తనదేనని పగటి కలలు కంటున్నాడు. వైసీపీ అధికారం కోసం తప్ప ప్రజల బాగోగుల కోసం ఆలోచించడం లేదు. వైసీపీ దురాలోచనలకు రాష్ట్ర ప్రజలు ఏవిధంగా బుద్ది చెప్పారో ఈ నెల 23న తెలుస్తుంది అని మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మాటలు నమ్మి ప్రజలు పందేలు కట్టి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలను ఆపే హక్కు ఎవరికీ లేదు. పథకాలు ఆగిపోతాయని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. రాష్ట్రంలో ఉన్న తీవ్రమైన సమస్యలపై సీఎం సమీక్షలు నిర్వహించి ప్రజలకు భరోసా ఇవ్వ్వవలసి ఉంది. ఇతర రాష్ట్రాలలో ఆయా ముఖ్యమంత్రులు సమీక్షలు నిర్వహిస్తుంటే ఈసీ ఆంధ్రలో మాత్రం ప్రజలను ఇబ్బందులకు ఉరి చేస్తోందని ని విమర్శించారు.













