తన పరిధి దాటి ప్రవర్తిస్తే … మే 23న తగిన మ్యూలం
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయాలు అమలు చేయడం తప్ప.. అడ్డుపడే అధికారం లేదని మంత్రి ప్రతిపాటి పుల్లారావు సృష్టం చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పక్షాన నిలబడ్డారని సీఎస్ తన పరిధి దాటి ప్రవర్తిస్తే మే 23న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఎలాంటి అధికారాలు లేవని సీఎస్ మాట్లాడడం సరికదన్నారు. సీఎస్ రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్నట్లు సృష్టంగా కనిపిస్తోందని అన్నారు. అధికారాలు లేని ముఖ్యమంత్రి అని ఏ విధంగా మాట్లాడుతున్నారో సీఎస్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని, జూన్ 8 వరకు ఆయనకు ఐదేళ్లు పూర్తి కాల సమయం ఉందని అన్నారు. చీప్ సెక్రటరీ రాజ్యాంగేతర శక్తిగా.. ఒక రాజకీయ పార్టీకి పక్షపాతిగా ఉన్నట్లు సృష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఎందుకంటే సీఎస్ సమీక్ష నిర్వహించిన మరుసటి రోజునే ఢిల్లీ వెళ్లారని, సీఎస్ కూడా కుట్ర రాజకీయాల్లో భాగస్వామ్యం కాబోతున్నారని రాష్ట్ర ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.













