బీజేపీలో చేరిన జనసేన కీలకనేత
కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, త్రిపురా కన్స్ట్రక్షన్స్ అధినేత పసుపులేటి సుధాకర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్రావు సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కావలి పట్టణంలో పర్యటిస్తున్న రోజే సుధాకర్ ఢిల్లీలో పార్టీ తీర్థం తీసుకోవడం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఆర్థికంగా బలమైన పసుపులేటి సుధాకర్ బీజేపీలో చేరడం, ఏకంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మురళిధర్ రావు సమక్షంలో చేరడంతో కావలి నియోజకవర్గంలో బీజేపీ బలపడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.













