Atchannaidu:ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా : మంత్రి అచ్చెన్న

ఎగువన కురుస్తున్న వర్షాలతో పార్వతీపురం (Parvathipuram) మన్యం జిల్లాలో నాగావళి, వంశధార నదుల్లో వరద ఉద్ధవృతి పెరుగోతంది. నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. నదుల్లో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ (Collector) , ఎస్పీ (SP) లతో ఫోన్లలో ఆయన మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వరద ముప్పు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కంట్రోల్ రూమ్ (Control room) సేవలతో పాటు అధికారులు అందుబాటులో ఉండాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. అవరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విపత్తు బృందాలు పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. గాలులు, భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రావద్దని మంత్రివిజ్ఞప్తి చేశారు.