గుడిమల్లంలో హోమం చేసిన విదేశీయలు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరుశురామేశ్వర స్వామి ఆలయంలో విదేశీయులు పరశురామ తంత్రం హోమం నిర్వహించారు. యూఎస్‌కు చెందిన డేవిడ్సన్, అలెక్స్ అభిషేక పూజలు, హోమం చేసి స్వామిని దర్శించుకున్నారు. వేదాల ఆవిర్భావం గురించి పరిశీలన చేసే క్రమంలో ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. అమెరికాలో పోలీస్ ఫోర్స్ ట్రైనీగా విధులు నిర్వహిస్తున్న డేవిడ్ సన్ మాట్లాడుతూ తను పుట్టిన తేదీ ప్రకారం వేద పండితులు సూచనల మేరకు ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి, శివ గోత్రాన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వీరి వెంట గ్రామ సర్పంచ్ సుబ్రహ్మాణ్యం, గుడిమల్లం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నరసింహ యాదవ్, ఈవో రామచంద్రరెడ్డి ఉన్నారు.













