Anuradha: ఆయన పగలు పూజలు.. రాత్రంతా దోపిడీలు : పంచుమర్తి అనురాధ
రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు జగన్ అయితే, ఆయన్ను మించిన వ్యక్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Ramachandra Reddy )అని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ (Anuradha) విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు ఓటర్ల లిస్టు (Voters list) కన్నా పెద్దిరెడ్డి అవినీతి, పాపాల లిస్టే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన పగలు పూజలు.. రాత్రంతా దోపిడీలు చేస్తుంటారని ఆరోపించారు. పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం మండల (Mandal) స్థాయి నుంచి కేంద్రం (Center) వరకు పాకిందన్నారు. శివశక్తి పాల డైయిరీ ద్వారా రైతుల రక్తన్ని పీల్చుతున్నారన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో అసైన్ భూములు, పుంగునూరు మండలం రాగానిపల్లెలో భూములు కొట్టేయలేదా అని ప్రశ్నించారు. రేణిగుంట పరధిలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమి పెద్దిరెడ్డి భార్య పేరున ఎలా వచ్చిందని అనురాధా నిలదీశారు.













