ఆ రెండు పూర్తిచేయడమే మా ప్రభుత్వ లక్ష్యం : పల్లా శ్రీనివాసరావు
రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటును ప్రజలంతా హర్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి కాబోతోందని గర్వంగా చెబుతున్నాం. అమరావతి, పోలవరం రెండూ పూర్తిచేయడమే మా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. ఆర్థిక రాజధానిగా విశాఖను చేసి, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దేశంలోనే నంబర్ వన్ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతాం. రాజధాని పేరు చెప్పి గంజాయి రాజధానిగా మార్చేసిన ఘనత వైసీపీది. గంజాయి నిర్మూలనకు పూర్తి చర్యలు చేపట్టే కార్యాచరణ సిద్ధమవుతోంది. విశాఖకు మళ్లీ పూర్వవైభవం కల్పించే బాధ్యత మాది అని అన్నారు.













