ఏపీ అమ్మాయికి జాక్పాట్.. అమెజాన్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన అమ్మాయి స్నేహ కిరణ్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్లో రూ.44 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికైంది. తండ్రి సింహాచలం స్థానిక జీడీపప్పు ఫ్యాక్టరీలో పని చేస్తుండగా తల్లి సుభాషిణి గృహిణి. స్నేహ ప్రస్తుతం విశాఖపట్నంలోని ప్రైవేట్ కాలేజీలో బీటెక్, సీఎస్ఈ చివరి సంవత్సరం చదువుతోంది. గణితంపై చిన్నప్పటి నుంచే పట్టు సాధించిన స్నేహ కరోనా సమయంలో ఆన్లైన్ కోడిరగ్ నేర్చుకుంది. స్నేహితులతో కలిసి గ్రూప్ డిస్కషన్ చేసేది. అమెజాన్ ఇంటర్వ్యూ సందర్భంగా ఇవన్నీ తనకు కలసి వచ్చాయని స్నేహ చెప్పుకొచ్చింది.













