Chhaava: నెట్ ఫ్లిక్స్ లోకి ఛావా.. నిరాశలో ఫ్యాన్స్
ఛతప్రతి శివాజీ(Chatrapathi Sivaji)కొడుకు, శంభాజీ మహారాజ్(Sambhaji maharaj) కథగా తెరకెక్కిన ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ పాన్ ఇండియా సినిమా విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిసింది. థియేటర్లలో విజయవంతంగా ఆడిన ఛావా(Chhava) ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్(Netflix)లోకి వచ్చేసింది. థియేటర్లలో పలు భాషల్లో విడుదలైన ఛావా నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం హిందీలోనే రిలీజ్ చేశారు. కేవలం హిందీలోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయడంపై తెలుగు అభిమానుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) తెరకెక్కించిన ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ చనిపోయాక అతడి కొడుకు శంభాజీ మహారాజ్ ఎలా పరిపాలించాడు? శంభాజీ నాయకత్వంలో బుర్హాన్‌పూర్‌పై దాడి చేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుపై ప్రతీకారం తీర్చుకోవడం, అనంతరం జరిగిన ఘర్షణలను శంభాజీ మహారాజ్ ఏ విధంగా ఎదుర్కొన్నాడనే అంశాల చుట్టూ ఛావా కథ నడుస్తుంది. కథ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా ఛావా బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలోని విజువల్స్, ఏఆర్ రెహమాన్(AR Rahman) బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో పాటూ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఛావాను నెక్ట్స్ లెవెల్‌కు చేర్చాయి.
సినీ అభిమానులను బాగా మెప్పించిన ఛావా చిత్రంకు సినీ క్రిటిక్స్ మాత్రం మిక్డ్స్ రివ్యూలే ఇచ్చారు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం వేగంగా ఉండాలని, స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం వల్ల సినిమా స్లో అయిందని, ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఛావాలోని ప్రథమార్థం, వార్ సీన్స్ మరింత ఇంపాక్ట్ కలిగించేవని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఎవరేమన్నా సరే ఛావాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టి మూవీను బ్లాక్ బస్టర్ చేశారు.













