DA: ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక.. 2024 జనవరి నుంచి

ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి (Diwali) కానుకను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఉద్యోగులకు డీఏ (DA) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి (January) 1 నుంచి డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. రెగ్యులర్ ఉద్యోగులతో వేతనంలో ఇప్పటి వరకు డీఏ శాతం 33.67 ఉండగా, అది 37.31 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ (Piyush Kumar) ఆదేశాలు జారీ చేశారు.