ప్రతిపక్ష నేతలో పతాకస్థాయికి చేరిన ఓటమి భయం..
రాబోయే ఓటమికి సాకులు వెతుక్కుంటున్న ప్రతిపక్ష నేత జగన్
ప్రతిపక్ష నేతలో పతాకస్థాయికి చేరిన ఓటమి భయం..
ఈసీ విధులను రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా నిర్వర్తించగలతో జగన్మోహన్రెడ్డి సమాధానం చెప్పాలి
– సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల నాడి తెలుసుకున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. అందుకే చౌకబారు రాజకీయాల విమర్శలకు తెరదీసి ప్రజాక్షేత్రంలో అపహాస్యం పాలవుతున్నారు. రాష్ట్రంలో 59.18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి ఈసీని ఆశ్రయించడం అతనిలో నెలకొన్న ఓటమి భయానికి అద్దం పడుతోంది. ఈసీ స్వతంత్య్ర ప్రతిపత్తి గల సంస్థ. దానిపై కనీస పరిజ్ఞానం కూడా జగన్‌కు లేదు. వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్న జగన్‌కు.. ఓట్ల తొలగింపుగానీ, చేర్చడం గానీ ఈసీ పరిధిలో ఉంటాయని తెలియదా.? ఒకవేళ తొలగింపు జరిగితే దానిపై చర్యలు తీసుకోవాల్సింది రాజ్యాంగ బద్దమైన ఎన్నికల కమిషన్ అనే విషయం కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో విధంగా బురద జల్లాలనే ఆలోచనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వం మంచిపని చేసే ప్రతిసారి ఇలాంటి ఏదో ఒక పనికి మాలిన వార్తతో ప్రజల దృష్టిమరల్చాలని యత్నించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో నకిలీ ఓట్లు ఉన్నాయని గుర్తిస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్లకు ముందుగా పిర్యాదు చేయాలనే విషయం జగన్మోహన్రెడ్డికి తెలియదా.? ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వర రావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ రావులను బదిలీ చేయాలని చెప్పడం పోలీస్ వ్యవస్థపై ఆయనకున్న అపనమ్మకానికి నిదర్శనం. ఓట్లను చేర్చడం, తీసేయడం అంతా ఈసీ పని అయినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమేమిటో ప్రతిపక్ష నేత సమాధానం చెప్పాలి..? ఓటర్ కార్డులకు ఆధార్ కార్డును అటాచ్ చేయాలనే ప్రతిపాదన నాలుగేళ్లుగా వినిపిస్తున్నా.. ఈసీ ఇంత వరకు స్పందించలేదు. ఈసీ పరిధిలోని పని రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేసిందో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. అందుకుయాప్ తయారు చేశారన్నపుడు ఆ యాప్ వివరాలు బయటపెట్టాలి. లేకుంటే రాబోయే ఓటమిని ముందుగానే ఊహించి ప్రతిపక్ష నేత సాకులు వెతుక్కుంటున్నారనే ప్రజల భావననే నిజమని నమ్మవలసి ఉంటుంది.
SD/- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
వ్యవసాయ శాఖామాత్యులు













