ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్లకు ప్రాధాన్యం
ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నామో, కాపు రిజర్వేషన్లకు అంతే ప్రాధానత్య ఇస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాందీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లపై జగన్ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడూ కాపులకు అండగా ఉంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులకు అధిక ప్రాధానత్య ఇస్తామని సృష్టం చేశారు. పార్టీని వీడిన నేతలను తిరిగి తీసుకువస్తున్నామని తెలిపారు. 2019 ఎన్నికలో కాంగ్రెస్‌దీ కీలకపాత్ర అని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని సృష్టం చేశారు.













