మార్చి 30న ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన, అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి 30న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ శ్రీకోదండరాముని కల్యాణం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.













