Ongolu Gitta : రూ.41 కోట్లు పలకడం శుభపరిణామం : చంద్రబాబు
ప్రపంచ వేదికపై ఒంగోలు గిత్త (Ongolu Gitta) తన సత్తా చాటిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒంగోలు గిత్త రూ.41 కోట్లు పలకడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. ఒంగోలు గిత్తలు ఉన్నత జన్యువులు, బలానికి ప్రసిద్ధి చెందాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షిస్తూ పాడి రైతులను ఆదుకోవడానికి కృషి చేస్తోందని వెల్లడిరచారు. మిలమిల మెరిసే తెల్లటి శరీరం, చలి, వేడిని తట్టుకునే శరీరతత్వం, చూపరులను ఆకట్టుకునే మూపురం రంకెల్లో రాజసం ఒంగోలు జాతి పశువుల పేరెత్తగానే జంతు ప్రేమికుల కళ్లెదట కదలాడే దృశ్యాలివి. అటువంటి వాటికి పుట్టినిల్లు ప్రకాశం జిల్లా (Prakasam District). బ్రెజిల్ (Brazil) లో ఇటీవల నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతి గిత్త (వియాటినా-19) ఏకంగా రూ.41 కోట్ల ధర పలికింది.













