వైసీపీకి మరో షాక్.. ఎంపీ మాగుంట రాజీనామా
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. 11 సార్లు చట్టసభలకు పోటీ చేశా. మా కుటుంబానికి అహం లేదు. ఉన్నదల్లా ఆత్మగౌరవమే. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నాం. బాధాకరమే అయినా తప్పడం లేదు. ఒంగోలు ఎంపీ బరిలో నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించాం అని తెలిపారు.













