Perni Nani : పేర్ని నాని భార్యకు మరోసారి నోటీసులు
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ (Jayasudha) కు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ(Geetanjali Sharma) మరోసారి నోటీసులు జారీ చేశారు. గోదాములో బియ్యం మాయంపై ఇటీవల ప్రాథమిక విచారణ చేపట్టిన పౌరసరఫరాల శాఖ(Civil Supplies Department) అధికారులు తొలుత 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం షార్టేజీ వచ్చినట్లు గుర్తించారు. దీనికిగానూ ఇప్పటికే ఆమె రూ.1.68 కోట్లు జరిమానా చెల్లించారు. అయితే, తాజాగా ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు తేల్చారు. దీంతో పెరిగిన షార్టేజీకి కూడా జరిమానా చెల్లించాలని తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని గీతాంజలి శర్మ నోటీసుల్లో పేర్కొన్నారు.













