OG Vs Akhanda: ఒకడుగు వెనుకలో అఖండ
టాలీవుడ్ లో ఈ ఇయర్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్న పెద్ద సినిమాలేవైనా ఉన్నాయా అంటే అది పవన్ కళ్యాణ్(pawan Kalyan) ఓజి(OG) మరియు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అఖండ2(Akhanda2). ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో భారీ హైప్ ఉంది. అలాంటి రెండు పెద్ద సినిమాలు సెప్టెంబర్ 25న అంటే ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రానుండటం అందరినీ కంగారు పెడుతుంది.
భారీ సినిమాలు ఒకేరోజున రిలీజవడంతో ఆ ఎఫెక్ట్ వాటి ఓపెనింగ్స్ పై పడే ఛాన్సుంది. అయినప్పటికీ రెండు సినిమాల మేకర్స్ ఎక్కడా వెనుకడుగేయడం లేదు. ఇక అసలు విషయానికొస్తే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఓజి నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ప్లాన్ చేశారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజి రిలీజ్ కు రెడీ అయి ప్రమోషన్స్ ను మొదలుపెడితే అఖండ2 మాత్రం ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఓజితో పోటీ పడాలంటే అఖండ2 నుంచి కూడా చిత్ర యూనిట్ ఏదొక కంటెంట్ ను అప్డేట్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అఖండ2 దానికి తగ్గ ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారో చూడాలి.







