సీఎం వైఎస్ జగన్ కు.. కాణిపాకం నుంచి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్ఎస్బాబు, కాణిపాకం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్‌రెడ్డి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవీ.సురేష్ బాబు కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలంటూ కలిసి ఆహ్వానించారు. ఇదే సమయంలో సమయంలో ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహాహాకుంభాషిషేకం ఆహానపత్రికను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. ఆహ్వానపత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం ఆలయ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో కే. విద్యాసాగర్ రెడ్డి, ఎం. చంద్రశేఖర్ రెడ్డి, వి. మార్కండేయ శర్మ, ఎం శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు.













