ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా.. కరోనా బాధితులకు

కరోనా బాధితులకు సేవలందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య విభాగం ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. అమెరికాలో ఉంటున్న ప్రముఖ వైద్యుడు లోకేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ విభాగం పనిచేస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు 592 మంది వైద్య సహాయానికి అభ్యర్థిస్తే, 351 మంది సమస్యలు పరిష్కరించాం. వైద్య సహాయం పొందిన వారిలో 185 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 98 మంది దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. 80 మంది అభ్యర్థనలు ప్రభుత్వానికి బదిలీ చేశారు. కరోనా విపత్తును ఎదుర్కోవడంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం విఫలమవుతున్నందున.. టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ సమష్టిగా ఈ సేవా విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అండగా ఉండాలని నిర్ణయించామని ఒక ప్రకనటలో తెలిపింది.