నేటి నుంచి రోజుకు వెయ్యి మందికి : నారా భువనేశ్వరి
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి జూమ్ ద్వారా రోజుకు వెయ్యి మందికి వైద్య సలహాలు, అవసరమైన సహాయం అందించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. 360 మంది కొవిడ్ బాధితులకు వైద్య సహాయం, మందులను అందించామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం వర్గాల ద్వారా జూమ్ లింక్‌ను ప్రజలకు అందేలా ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు టెలిమెడిసిన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తెలుగుదేశం వైద్య విభాగం అధ్యక్షుడు జడ్.శివప్రసాద్ 5 వేల మందికి మందులు అందిస్తున్నారని తెలిపారు.













