హిందూపురంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
అనంతపురం జిల్లా హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ట ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో గెలిచి.. మొదటిసారి హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని లేపాక్షి చిలమత్తూరు, హిందూపురం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాల వేసి నివాళులర్పించారు. బాలకృష్ణ వెంటన ఆయన సతీమణి వసుంధర కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, తనను ఆదరించి అధిక మెజారిటీతో గెలిపించిన పురం ప్రజలకు తన చివరి శ్వాస వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అధికార పక్షం సహాయ సహకారాలతో హిందూపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రావేళ్ళ లక్ష్మి, నాయకులు వెంకటస్వామి, రంగ, అంబికా, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.













