Chandra Babu :తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ : చంద్రబాబు
తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) కొనియాడారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు(MaiduKuru)లో నిర్వహించిన ఎన్టీఆర్ (NTR) వర్ధంతి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. అనుక్షణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తపించిన నాయకుడు అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు, తెలుగువారి ఆత్మగౌరవం. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు. పేదవాళ్లకు పక్కా ఇళ్లు నిర్మించింది ఎన్టీఆర్ అని అన్నారు. ఈ నెలాఖరులో వాట్సాప్(WhatsApp) గవర్నెన్స్ తీసుకొస్తాం. ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే చాలు. మీ సమస్యల పరిష్కారానికి ఆఫీసు (Office)లకు వెళ్లే పని లేదు. మీ ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నాం అని తెలిపారు.













