ప్రవాసాంధ్ర బీమాలో 50 శాతం ప్రభుత్వ రాయితీ
విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్ర భరోసా బీమా ప్రీమియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం రాయితీ అందిస్తుందని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి, సీఈఓ పి హేమలత రాణి తెలిపారు. ఉద్యోగులు, వలస కార్మికులు, డ్రైవర్లు, హౌస్ మెయిడ్స్, హెల్పర్లు వివిధ రంగాల్లో పనిచేసే వారు మూడేళ్లకు రూ.275లతో, విద్యార్థులు పూర్తి ఉచితంగా బీమాలో నమోదు చేసుకోవచునని వివరించారు. ఈ నెల 26 నుంచి జనవరి 15 వరకు నమోదుకు అవకాశం ఉందన్నారు. బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10 లక్షలు ఆర్థికసాయం ఉంటుందన్నారు. ప్రమాదం వల్ల కలిగే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే ఆస్పత్రుల ఖర్చులకు రూ.లక్ష వరకు చెల్లిస్తారని తెలిపారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి హాస్పిటల్ ఖర్చులకు రూ.50 వేల వరకు చెల్లింపు చేస్తారని వివరించారు. బీమా నమోదు కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు 91863-2340678, 8500027678 సంప్రదించాలని పేర్కొన్నారు.













