విద్యార్థులతో ప్రవాసాంధ్రుల వీడియోకాన్ఫరెన్సు
జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన విద్యా వికాసం అంశంపై ఉత్తర అమెరికా నుంచి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్, అమెరికాలో జన్మభూమి పర్యవేక్షకులు శ్రీకాంత్ దొడ్డపిన్ని, తానా అధ్యక్షుడు సతీష్ వేమన తదితర ప్రవాసాంధ్రులు వీడియోకాన్ఫరెన్సులో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నారైలు కలిసి డిజిటల్ తరగతులు ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. డిజిటల్ తరగతులు ప్రారంభమైన తర్వాత వచ్చిన మార్పులపై అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలను ప్రధానోపాధ్యాయులు వివరించారు













