కాణిపాకం వినాయకుడికి ఎన్ఆర్ఐలు … రూ. 3 కోట్ల విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి అంతర్ ఆలయ ద్వారం, గోడలకు అమర్చేందుకు ఆలయ పునర్నిర్మాణ దాతలు ఎన్ఆర్ఐలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ వెండి తొడుగులు వితరణ చేశారు. 340 కిలోలున్న ఈ తొడుగులను ఆలయ ప్రాంగణంలో దాతల ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ఈవో ఎ.వెంకటేశుకు అందజేశారు. వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని ఈవో తెలిపారు. వెండి తొడుగులు అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. దేవాదాయశాఖ అభరణాల పరిశీలనాధికారి వాణి, సూపరింటెండెంట్ కోదండపాణి, మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ విఘ్నేశ్ పాల్గొన్నారు.













