చంద్రబాబు విదేశీయాత్ర సీక్రెట్ అదే.. స్పష్టం చేసిన ఎన్నారైలు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మైకులతో పాటు నాయకులూ కూడా మూగనోము పట్టారు.. ఎక్కడి వాళ్ళు అక్కడ హాలిడేస్ పేరుతో విదేశాలకు కుటుంబ సమేతంగా వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లిన నారా చంద్రబాబుపై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మోదీ నామినేషన్ సందర్భంగా వారణాసిలో కల్పించిన చంద్రబాబు ఆ తరువాత కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన విదేశీయాత్రకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా అధికారికంగా ఎక్కడ కనిపించలేదు.
వైద్య పరీక్షల కోసం సతీమణి సమేతంగా చంద్రబాబు అమెరికాకు వెళ్లారని.. ఓ వారం రోజులు ఉండి వస్తారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే హైదరాబాద్ నుంచి చంద్రబాబు బయలుదేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ లేదు. మరోపక్క చంద్రబాబు సింగపూర్లో ఉన్న కొన్ని వ్యాపారాల లావాదేవీల నిమిత్తం అక్కడికి వెళ్లారని సోషల్ మీడియాలో గాసిప్స్ తెరపైకి వచ్చాయి. మరోపక్క అమెరికా నుంచి ఇటలీకి వెళ్లారని.. ఇటలీలోని కుమో ప్రాంతంలో చంద్రబాబు కారులో కనిపించారని మరొక వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.
అయితే వీటిపై స్పందించిన ఎన్నారై వర్గాలు.. చంద్రబాబు అమెరికాలోనే ఉన్నారు అంటూ హాస్పిటల్ పేరుతో సహా ఓ తాజా వార్తను తెరపైకి తెచ్చారు.. మిన్నెసోటా రాష్ట్రంలో ఓ హాస్పిటల్ లో చంద్రబాబు టోటల్ బాడీ చెకప్ చేయించుకుంటున్నారని ఎన్నారై వర్గాల నుంచి అందిన సమాచారం. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 53 రోజులపాటు జైల్లో ఉండి వచ్చిన తర్వాత చంద్రబాబు కాస్త అస్వస్థతకు గురి అయ్యారు. అనంతరం కంటి ఆపరేషన్ ఆ తర్వాత విశ్రాంతి లేకుండా ప్రచారం చేయడం.. వీటన్నిటితో ఆయన బాగా అలసిపోయారు. వయసు కూడా తక్కువేమీ కాదు కాబట్టి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకుని.. పూర్తి ఫిట్నెస్ తో తిరిగి ఆంధ్రకు రావడానికి అమెరికాలో ఉన్నారని ఎన్నారైలు చెబుతున్నారు. అని అనుకూలంగా జరిగితే మరో రెండు మూడు రోజుల్లో ఆయన ఏపీకి తిరిగి వస్తారని కూడా తెలుస్తోంది.













