హైకోర్టును ఆశ్రయించిన ఎన్ఆర్ఐ యశస్వి
తనపై సీఐడీ ఇచ్చిన లుక్ ఔట్ నోటీసును ఎత్తివేయాలని కోరుతూ ఎన్ఆర్ఐ యశస్వి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌ను ఇప్పటికే సీఐడీ అరెస్టు చేసి 41ఏ నోటీస్ ఇచ్చిందని న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు. లుక్ఔట్ నోటీసు ఉద్దేశం నెరవేరిందని పేర్కొన్నారు. లుక్ఔట్ నోటీసు కారణంగా విదేశాలకు వెళ్లాంటే పిటిషనర్‌కు ఇబ్బందులుంటాయని, ఈ నోటీసును కొట్టివేయాలని కోర్టును కోరారు. దీనిపై ఉన్నతాధికారుల సూచనలు తీసుకోవాలని సీఐడీకి న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని యశస్విపై సీఐడీ కేసు న మోదు చేసిన విషయం తెలిసిందే.













