అక్రమ కేసులకు భయపడం.. పోరాటం కొనసాగిస్తాం
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు ఐదుసార్లు తెనాలిలోని తన ఇంటిపై దాడి చేశారని ప్రవాసాంధ్రుడు బొద్దులూరి యశస్వి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తల్లికీ ఆరోగ్యం బాగా లేదని, చూసేందుకు అమెరికా నుంచి వస్తే లుక్అవుట్ నోటీసులిచ్చి 4 గంటలకు పైగా శంషాబాద్ విమానాశ్రయంలోనే ఉంచారని వెల్లడించారు. అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు.













