ఎన్నారైల సేవలు జనసేన ఎప్పటికీ మరిచిపోదు : పవన్ కల్యాణ్
ప్రవాస భారతీయుల సేవలను జనసేన ఎప్పటికీ మరిచిపోదని, పార్టీకి వీరు అందిస్తున్న మద్దతు అమోఘమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎన్నారైల ప్రేమాభిమానాలు, మద్దతు ఎప్పటికీ ఇలానే ఉండాలని కాంక్షించారు. పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ కొలికొండ శశిధర్ ఆధ్వర్యంలో యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్లకు చెందిన జనసేన ఎన్నారైల బృందాలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ను కలిశాయి. పార్టీ సహాయ నిధికి రూ.1.30 కోట్లు విరాళంగా అందించాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ ప్రయాణంలో ఎన్నారైలు అందిస్తున్న సహకారం, జనసేన ప్రస్థానంలో గుర్తుండిపోతుందని తెలిపారు.













