తిత్లీ తుపాన్ బాధితులకు ఎన్నారై విరాళం
రాజకీయాలకు ఆర్థిక విధానాలను మేళవించి, పరిపాలనా నిర్ణయాలు తీసుకోవడం మూలంగానే అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రిని విజయవాడకు చెందిన డాక్టర్ గూడపాటి నాగేశ్వరావు, అమెరికాలోని ఫ్లోరిడా తెలుగు అసోసియేషన్ వ్వవస్థాపకులు డాక్టర్ గూడపాటి రామ్మోహన్రావు, లక్ష్మీభారతి దంపతులు కలిశారు. తిత్లీ తుఫాన్ బాధితుల సహాయార్థం డాక్టర్ రామ్మోహన్రావు దంపతులు రూ.2.5 లక్షల చెక్కును అందజేశారు. ఫ్లోరిడా తెలుగు అసోసియేషన్ సభ్యుల నుంచి సేకరించిన రూ.లక్షా 9వేల చెక్కను కూడా అందజేశారు. సీఎం సహాయనిధికి ఆయన సోదరుడు గూడపాటి నాగేశ్వరరావు రూ.5 లక్షల చెక్కును వ్యక్తిగతంగా చంద్రబాబుకు అందజేశారు.













