నవ్యాంధ్రలో నక్షత్రాల నవ హోటెల్… నోవోటెల్
అంతర్జాతీయ విమానాశ్రయస్థాయికి తోడుగా అమారావతిలో ఐదునక్షత్రాల అతిధ్యంఆరంభమయ్యింది.
బెంజ్ సర్కిల్ సమీపంలోని భారతీనగర్ లో2014 లో మొదలైన “నోవొటెల్ వరుణ్ విజయవాడ” ₹ 150కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తిచేసుకుని,.. లగ్జరీ గదులు, స్విట్ లతోపాటు సర్వీస్ అపార్ట్మెంట్స్ వంటి వినూత్న విడిది ఎంపికలతో అతిధులను ఆహ్వానిస్తోంది.
డిసెంబర్ 9 వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాంభోత్సవం జరుపుకున్న ఈ అత్యాధునిక ఆతిధ్యకేంద్రం సేవలను అందుకుంటున్నవారిలో నగరానికి రోజూ వచ్చే విదేశీయులు, పారిశ్రామికాధిపతులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు, రాజకీయనాయకులే కాక ఇటీవల విజయవాడకు తరలివచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా ఉండటం విశేషం!
“విజయవాడ నగరం నేను-వరుణ్ సంస్థ కూడాపుట్టి పెరిగిన ప్రాంతం అయినందున మాకు ఈ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకం.
ఈ స్థలాన్ని గత 30 ఏళ్లుగా ఇటువంటి ప్రాజెక్ట్ కోసం నిరీక్షణలో ఉంచాము!
అతిధుల సంతృప్తిని గెలుచుకోవటమే లక్ష్యంగా నొవొటెల్ సిబ్బంది సేవలందిస్తారు. అతిధి లేదా వినియోగదారుల సంతోషాన్ని వ్యాపారావకాశంగా భావించటమే వరుణ్ సంస్థ ఉద్యోగుల ప్రధాన వ్యూహం. దేశంలోని నోవొటెల్ వ్యాపార విస్తరణలో ఇది 20 వ శాఖగా ఉండబోతోంది. సౌరవిద్యుత్ వంటి అనేక ప్రకృతి అనుకూల వ్యవస్థలతో ఈ హోటల్ సదుపాయాలను నిర్వహించనున్నాము. వరుణ్ సంస్థ తదుపరి కార్యాచరణలో, అమరావతి రాజధాని ప్రాంతంలో మరొకఅంతర్జాతీయ ఆతిధ్య శాఖ కోసం కూడా మా వద్ద ప్రణాళిక ఉంది. రాబోయే సంవత్సరకాలంలో రాజధాని నడుమన, ఉద్దండరాయునిపాలెంలో
9 ఎకరాల సువిశాల కన్వెన్షన్ సెంటర్ మా అత్యుత్తమ నిర్మాణంగా ఉంటుంది” అని వరుణ్ గ్రూప్స్ చైర్మన్ “ప్రభు కిషోర్” వివరించారు
“నొవొటెల్ వరుణ్ విజయవాడ” ఆంధ్రుల రాజధానిలో అత్యాధునిక వసతి సౌకర్యాలతో స్థానికులతో పాటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి 202 విలాసవంతమైన గదులు, 25 ఆతిధ్య అపార్ట్మెంట్స్, 4 ఆహారశాలలు, 7 సమావేశ గదులు, 10 వేల చదరపు అడుగుల విందు మందిరం, అత్యాధునిక వ్యాయమశాల, స్పా, విశాలమైన పైకప్పు ఈత కొలను మరియు ఆరోగ్య ఆకర్షణగా 202 మీటర్స్ రూఫ్ టాప్ జాగింగ్ ట్రాక్ కొలువుదీరాయి!
ఆహారప్రియుల కోసం రూఫ్ టాప్ రెస్టారెంట్, 4 రకాల ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ క్విజిన్ ఆహారశాలలు వడ్డిస్తుండగా,..మద్య ప్రియుల కోసం గోర్మయ్ బార్ (Gourmet Bar) లాబిలో సిద్ధంగా ఉంది.
సుప్రసిద్ధ స్థానిక వంటకాలు – ఖండాంతర రుచుల మేళవింపుతో ఆహారం, విశ్రాంతి సౌకర్యాలతో ప్రారంభమైన ఈ “భారీ బస” అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 25 నిమిషాలు, రైల్వే స్టేషన్ నుంచి 20 నిమిషాల వ్యవధి ప్రయాణదూరంలో అందుబాటులోకి రావటంతో రాజధాని పర్యాటకం పూర్తిస్థాయి విలాసవంతంగా పరిణామం చెందుతోంది….













