టీడీపీ నుంచీ వైసీపీలో చేరిన ఎమ్మెల్యేకు నోటీసులు
తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్, వల్లభనేని వంశీ ఈ నెల 29న మధ్యాహ్నం విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్ డోలా బాలవీరాజంనేయస్వామి పిటిషన్ వేశారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇచ్చామని, వారిపై చర్యలు తీసుకోవాలని అధినేత చంద్రబాబు తన అభిప్రాయాన్ని ఇప్పటికే స్పీకర్‌కు తెలియజేశారు.













