కేంద్రం మరోసారి పాతపాటే
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక సహాయం అందిస్తామని, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల తర్వాత ప్రత్యేక హోదా అనేదే లేదని కేంద్రం మరోసారి పాతపాటే పాడింది. లోక్‌సభలో టీడీపీ సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్శకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో ప్రత్యేక హోదా ఏయే రాష్ట్రాలకు కల్పించాలో సృష్టంగా వర్గీకరించారని తెలిపారు. 2014 ఫిబ్రవరిలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల తర్వాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా పోయిందని చెప్పారు. విభజన చట్టం కింద ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.













