జగన్ పాదయాత్రలో వీటికి చెక్!
విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న అభిమాని దాడి చేసిన నేపథ్యంలో ఈసారి జగన్ పాదయాత్రకు విస్తృత భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ పాలరాజు పోలీసులకు ఈ మేరకు ప్రత్యేక సూచనలిచ్చారు. ఇకపై జగన్ పాదయాత్రలో సెల్ఫీలు, ఆలింగనాలు లేకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటి వరకు కొద్ది మందితో రోప్పార్టీ మధ్య ఆయన పాదయాత్ర చేసేవారు. ఇకపై 50 మంది పోలీసులతో కూడిన రోప్ పార్టీని ఉంటుందని సాలూరు సీఐ సయ్యద్ ఇలియాస్ మహమ్మద్ సృష్టం చేశారు. జగన్ను కలిసే వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. సీఆర్పీఎఫ్ పోలీసులతో పాదయాత్ర మార్గంలో కల్వర్ట్ల తనిఖీలు చేయించనున్నారు. నిఘాకు డ్రోన్ కెమెరాలతో పాటు బాడీ వేర్ కెమెరాలను వినియోగించనున్నారు. వీడియో చిత్రీకరణతో భద్రత చర్యలను విస్తృతం చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించింది.













