వాహనాలు 12వేలకు మించితే తిరుమలకు .. అనుమతి లేదు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారనే ఆలోచనతో టీటీడీ నిఘా, భద్రతా విభాగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. తిరుమలకు వెల్లే అన్ని వాహనాలు 12 వేలు దాటిన తరువాత అనుమతించకూడదని నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరమలకు వెళ్లాలని సూచించింది. ఏటా గరుడ వాహన సేవ రోజు ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. ఈ ఏడాది గరుడ సేవ 1వ తేదీ కాగా ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబరు 2 వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు.













