ఏపీ మంత్రులుగా ఫరూక్, కిడారి ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి నూతనంగా ఇద్దరు మంత్రులు చేశారు. ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్కుమార్లతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఫరూక్‌కు వైద్య, విద్య, ఎన్టీఆర్ వైద్య సేవ, ఏపీఎంఐడీసీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, మైనారిటీ సంక్షేమ శాఖలు కేటాయించారు. శ్రావణ్‌కు గిరిజన సంక్షేమంతో పాటు ప్రాథమిక వైద్యం, కుటుంబ సంక్షేమం, ఆయుష్ వైద్యవిధాన పరిషత్ కూడా ఆయనకు కేటాయించారు. మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను నిర్వహించారు. ఎస్టీ సంక్షేమం శ్రావణ్‌కు ఇవ్వడంతో ఆయన వద్ద ఎస్సీ సంక్షేమం ఒక్కటే మిగిలింది. దీంతో ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖను కూడా చంద్రబాబు అప్పగించారు.













