ఏపీకి ప్రత్యేక హోదా… ముగిసిన అధ్యాయమే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖ మరోసారి చెప్పిన విషయాలే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని మరోసారి లోక్సభలో స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యత ఇవ్వలేదు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచినట్లు మంత్రి గుర్తు చేశారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫార్సులను కొనసాగించింది. విభజన చట్టం హామీలను చాలావరకు నెరవేర్చాం. కొన్ని మాత్రమే పెండిరగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మధ్య 28 సమావేశాలు ఏర్పాటు చేశాం అని మంత్రి తెలిపారు.













