సీఎం వైఎస్ జగన్ ను కలిసిన నీతి ఆయోగ్ బృందం
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నీతి ఆయోగ్ బృందం కలిసింది. ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ 2020-21 రిపోర్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధప్రదేశ్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నీతి ఆయోగ్ సభ్యులకు వివరించారు. ఆంధప్రదేశ్ ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించుకునేందుకు కృషి చేస్తుందని ముఖ్యమంత్రితో జరిగిన చర్చలో అధికారులు వెల్లడించారు. నవరత్నాలలో భాగంగా వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడంపై పూర్తి సంతృప్తి వ్యక్తం తెలిపారు. విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను నీతిఆయోగ్ సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనపై రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు నీతిఆయోగ్ ఆధ్వర్యంలో దిశానిర్ధేశం చేసినట్లు అధికారుల బృందం ముఖ్యమంత్రికి వివరించారు.













