నిషిత్ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లాలోని పెన్నానది తీరంలో నిషిత్ అంత్యక్రియలు జరిగాయి. నారాయణ అంత్యక్రియలు నిర్వహించి కుమారుడి చితికి నిప్పు పెట్టారు. అంతకుముందు నెల్లూరులోని నారాయణ కళాశాల నుంచి బోడిగాడితోటలోని శ్మశాన వాటిక వరకు నిషిత్ అంతిమయాత్ర చేపట్టారు. లోకేశ్ సహా పలువురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిషిత్కు నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. నిషిత్ను కడసారి చూసేందుకు బంధువులు, అభిమానులు, ప్రజలు, నారాయణ సిబ్బంది, విద్యార్థులు భారీగా తరలివచ్చారు.













