కేంద్ర మంత్రులకు తెలుగు రాష్ట్రాల బాధ్యతలు
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కేంద్రమంత్రులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలోని 33 జిల్లాల అధికారులతో, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆంధప్రదేశ్‌లోని 13 జిల్లాల అధికారులతో కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా చర్చించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు. నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని ఇద్దరు కేంద్రమంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు. ఇప్పటి వరకు తెలంగాణలో 45, ఆంధప్రదేశ్‌లో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.













