Polavaram: పోలవరం ఎత్తును తగ్గించింది జగన్ ప్రభుత్వమే
పోలవరం కోసం 2014 నుంచి ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Ramanaidu0 తెలిపారు. శాసనమండలి (Legislative Council)లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. పోలవరం (Polavaram) కోసం కేంద్రం రూ.17,860 కోట్లు చెల్లించింది. ప్రాజెక్టు వల్ల 96,660 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. నిర్వాసితులకు తొలి దశలో రూ.1,203 కోట్లు అందించాం. ఇంకా 18,266 కుటుంబాలకు రూ.1340 కోట్లు చెల్లించాలి. ఇప్పటివరకు 12,797 నిర్వాసితుల కుటుంబాలను తరలించాం. ఇంకా 27,263 కుటుంబాలను తరలించాలి. 75 నిర్వాసితుల కాలనీల్లో 49 నిర్మాణంలో ఉన్నాయి. ఆగస్టు లోపు భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి దశ ఆర్అండ్ఆర్ (R&R)ను 2026 జూన్ లోపు పూర్తి చేస్తాం. పోలవరం ఎత్తును జగన్ హయాంలోనే రెండుగా విభజించారు. పోలవరానికి 41.45 మీటర్ల ఎత్తు ప్రతిపాదన పెట్టింది వైసీపీ (YCP) ప్రభుత్వమే. పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో జగన్ (Jagan ) నే అడగాలి. నిర్వాసితుల కాలనీల్లో ఒక్క ఇంటికి ఆయన హయాంలో పునాది వేయలేదు అని అన్నారు.













