పాలకొండ జనసేన అభ్యర్థి ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన పాలకొండ నుంచి బరిలో దిగేందుకు ఆశావహులెందరో పోటీ పడ్డప్పటికీ పలుసార్లు సర్వే చేసి ఎక్కువ మంది మద్దతు లభించిన జయకృష్ణ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో జనసేన పోటీ చేసే మొత్తం 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది.













