నిమ్మగడ్డ ఏపీ గవర్నర్ అయిపోతారా…?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు ఈ మధ్య కాలంలో కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టూ దాదాపుగా రెండు మూడు నెలల నుంచి రాజకీయం నడుస్తుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి వీలులేదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా సరే హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్లి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. అయితే ఈ ఎన్నికల నిర్వహణ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అప్పించే పదవి ఏంటి అనేది ఇప్పుడు స్పష్టత రావడం లేదు.
వాస్తవానికి ఆయన రిటైర్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సహా ఇతర పార్టీలన్నీ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయనను గవర్నర్ పదవి నుంచి తప్పించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది.
రమేష్ కుమార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కాస్త దూకుడుగా అడుగులు వేస్తున్నారు రాజకీయంగా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక తెలుగుదేశం పార్టీ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కాస్త సానుకూలంగానే ఉండవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయంలో దూకుడుగా వెళ్ళాలి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ మాత్రం కూడా సంకోచించడం లేదు. ఎలాంటి నిర్ణయమైనా సరే ఆయన వేగంగా తీసుకుంటున్నాను.
అందుకే ఇప్పుడు కేంద్ర హోంశాఖ రాష్ట్ర గవర్నర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని నియమించే ఆలోచనలో ఉందని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో కూడా కేంద్ర హోంశాఖ అధికారులు మాట్లాడారట. అలాగే హోం శాఖ మంత్రి కూడా త్వరలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో మాట్లాడే అవకాశం ఉంది. ఈ నెల 30వ తారీకు ఆయన పదవీకాలం ముగుస్తున్నది. కాబట్టి ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి గవర్నర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో విపక్షాలు ఎన్ని ఫిర్యాదులు చేసినా సరే ప్రస్తుతం ఉన్న గవర్నర్ పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ విమర్శల నుంచి బయటకు రావడానికి గవర్నర్ ను మారిస్తే మంచిది అనే భావన వ్యక్తం చేస్తున్నారు పెద్దలు. ఇటీవల రాజస్థాన్ లేదా మధ్య ప్రదేశ్ గవర్నర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని నియమించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది.













