ఏపీ ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతల స్వీకరణ
రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ద స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, రాగద్వేషాలకు అతీతంగానే ఎప్పుడూ వ్యవహరిస్తుందని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్రు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా హైదరాబాద్‌లో బాధ్యతలను స్వీకరించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్లకు సంబంధిత అధికారులకు ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీ మోహన్ ద్వారా తెలియజేశామన్నారు. ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా తోడ్పాటు ఉంటుందనే ఆశాభావాన్ని నిమ్మగడ్డ వ్యక్తం చేశారు.













