అధికారులు నిర్లక్ష్యం చేస్తే.. ఎన్నికల సంఘం దృష్టికి : నిమ్మగడ్డ రమేశ్
వాలంటీర్ల ద్వారా లబ్ధిపొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ మాట్లాడుతూ ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించినా, దానికి భిన్నంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో నకిలీ ఈఆర్వో పనిచేశారు. ఎన్నికల్లో ఇలా నకిలీ అధికారులు పనిచేయడం ఆందోళన కలిగిస్తుంది. ఓటర్ల వివరాలను వాలంటీర్లు అధికార పార్టీకి అందిస్తున్నారు. వైసీపీ కోసం వాలంటీర్లు కష్టపడాలన్న మంత్రుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అధికారులు ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం అని అన్నారు.













