ఇలాంటి పనులు ఇతరులెవరూ చేసేందుకు.. సాహసించని రీతిలో చర్యలు
మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేశ్ ఫిర్యాదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియో దృశ్యాలను ఈసీకి అందించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి పనులు ఇతరులెవరూ చేసేందుకు సాహసించని రీతిలో చర్యలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల రోజు పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను మాచర్ల ఎమ్మెల్యే నేలకేసి కొట్టి అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ దురాగతానికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో వెలుగులోకి వచ్చింది.













