ఆ ఘటనపై 4 వారాల్లోగా… నివేదిక

ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని రుయా ఆస్పత్రిలో ఈ నెల 10న ఆక్సిజన్ అందకపోవడం వల్ల 11 మంది రోగులు మృతిచెందినట్లు జేస్తడి సుధాకర్ అనే వ్యక్తి, 30 మంది చనిపోయారంటూ మాజీ ఎంపీ చింతా మోహన్ ఎన్‍హెచ్‍ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే ఎన్‍హెచ్‍ఆర్సీ స్పందించింది. ఆక్సిజన్ కొరతతో రోగులు మృతి చెందిన ఘటనపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫిర్యాదులు నిజమైతే తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని ఎన్‍హెచ్‍ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.